వైరల్: పాల ప్యాకెట్లు దొంగతనం చేసిన పెట్రోలింగ్ పోలీస్

కంచే చేను మేసిందన్న చందంగా.. దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీసులే దొంగతనం చేసిన ఘటన యూపీలో జరిగింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. నోయిడాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. అందులో భాగంగా.. నోయిడాకు చెందిన ఇద్దరు పోలీసులు ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక షాపు ముందు పాల ట్రేలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన ఒక పోలీసు అధికారి కాసేపు అక్కడ అటూ ఇటూ నడుస్తు కనిపించాడు. కాసేపు అలా నడిచిన తర్వాత.. పాల ట్రేల నుంచి రెండు పాల ప్యాకెట్లు తీసి.. పక్కనే ఉన్న పెట్రోలింగ్ వాహానంలోని తన తోటి ఉద్యోగికి అందించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతుంది. తప్పులను అరికట్టాల్సిన పోలీసులే ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడితే ఎలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

For More News..

మంచుతో కారు.. అచ్చం ఒరిజినల్ కారులాగే..

వరల్డ్ రికార్డ్ వీడియో: గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్

Latest Updates