జాబ్​ పోతే ఇన్సూరెన్స్​.. వీక్లీ శాలరీ రూ.లక్ష వరకు

  • 3 నెలల లోన్‌‌ ఈఎంఐలు కవర్‌‌‌‌ డిసెబులిటీ వలన
  • జాబ్‌ పోతే వీక్లీ శాలరీజాబ్‌ లాస్‌ పాలసీల కోసం సపరేట్‌
  • వెర్టికల్‌‌ తెచ్చిన పాలసీ బజార్‌‌‌‌‌‌

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: సడెన్‌‌‌‌గా జాబ్‌‌‌‌ పోతే పరిస్థితేంటి?  జాబ్‌‌‌‌ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలుంటాయి. కరోనా వైరస్‌‌‌‌ అవుట్‌‌‌‌బ్రేక్‌‌‌‌తో ఈ ఏడాది  కోటి మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలా సడెన్‌‌‌‌గా జాబ్‌‌‌‌ లాస్‌‌‌‌ అయితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని డీల్‌‌‌‌ చేసేందుకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌  సపరేట్‌‌‌‌గా ఓ వెర్టికల్‌‌‌‌ను ‌‌‌‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ను ఇప్పటికే కొన్న ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీకి యాడ్‌‌‌‌ ఆన్‌‌‌‌గా మాత్రమే తీసుకోవడానికి వీలుంటోంది. కానీ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ లాస్ లేదా జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీని డైరక్ట్‌‌‌‌గా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కొనుగోలు చేసేందుకు పాలసీబజార్ అవకాశం కల్పిస్తోంది. ఎస్‌‌‌‌బీఐ జనరల్‌‌‌‌, శ్రీరామ్‌‌‌‌ జనరల్‌‌‌‌, యూనివర్సల్‌‌‌‌ సాంపో వంటి ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలతో కంపెనీ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ కుదుర్చుకుంది.  ఈ పాలసీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ జాబ్‌‌‌‌ కోల్పోతే కొంత టైమ్‌‌‌‌ వరకు ఫిక్స్‌‌‌‌డ్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ను వీరికి ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు చెల్లిస్తాయి.  కాగా, ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా జీడీపీ 23.9 శాతం పడిన విషయం తెలిసిందే. రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రికవరీ సంకేతాలున్నప్పటికీ ఇంకా జాబ్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ పుంజుకోలేదు. ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేయడంలో ప్రైవేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌పై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. సడెన్‌‌‌‌గా వచ్చే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఇండియన్‌‌‌‌ మిడిల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ రెడీగా ఉండాల్సిన అవసరం ఉందని పాలసీబజార్‌‌‌‌‌‌‌‌.కామ్‌‌‌‌ సీఈఓ శర్బ్వీర్  సింగ్‌‌‌‌ అన్నారు. లోన్లకు మంత్లీ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్స్ వంటి భారం వాళ్లపై ఉంటుందని చెప్పారు. ఇలాంటి అనిశ్చితి పరిస్థితులను తట్టుకునేందుకు  జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ లేదా ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ లాస్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ అవసరమని అన్నారు.

వీక్లీ శాలరీ రూ. లక్ష వరకు..

జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ వలన వచ్చే ఇన్‌‌‌‌కమ్‌‌‌‌లాస్‌‌‌‌ను ఈ ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీ కవర్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా సెల్ఫ్‌‌‌‌ ఎంప్లాయీడ్‌‌‌‌ పర్సన్స్‌‌‌‌ కూడా ఈ పాలసీ కింద కవర్‌‌‌‌‌‌‌‌ అవ్వడానికి వీలుంది.  జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ పాలసీ రెండు కండిషన్లలో పనిచేస్తుందని పాలసీబజార్‌‌‌‌‌‌‌‌  పేర్కొంది. మొదటిది ఉద్యోగం నుంచి ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌ తీసేయడం వలన కాగా, రెండోది యాక్సిడెంట్ల వలన డిసెబులిటీ లేదా చనిపోవడం వలన ఏర్పడిన జాబ్‌‌‌‌లాస్‌‌‌‌ లేదా ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ లాస్‌‌‌‌. మొదటి కండిషన్‌‌‌‌లో కస్టమర్ల లోన్ ఈఎంఐలను మూడు నెలల వరకు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు పే చేస్తాయి. అదే డిసెబులిటీ లేదా చనిపోవడం వలన జాబ్‌‌‌‌లాస్ ఏర్పడితే, కస్టమర్‌‌‌‌‌‌‌‌కు వీక్లీ శాలరీని రెండేళ్ల వరకు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు చెల్లిస్తాయి.  శాలరీడ్‌‌‌‌, సెల్ఫ్‌‌‌‌ ఎంప్లాయీడ్‌‌‌‌ కేటగిరీలను బట్టి వేరు వేరు ప్లాన్స్‌‌‌‌ను పాలసీబజార్ అందిస్తోంది. ఈ ప్లాన్ల కింద అందించే బెనిఫిట్స్‌‌‌‌ డిఫరెంట్‌‌‌‌గా ఉంటాయి. ఎంప్లాయర్‌‌‌‌‌‌‌‌ తొలగించడం వలన వచ్చిన జాబ్‌‌‌‌లాస్‌‌‌‌కు మూడు నెలల వరకు లోన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ అమౌంట్‌‌‌‌ను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. కస్టమర్లు చెల్లిస్తున్న ఈఎంఐకి తగ్గట్టు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీలు చెల్లించే ఈఎంఐ ఉంటుంది. అదే తాత్కాలిక లేదా పర్మినెంట్‌‌‌‌ డిసెబులిటీ  వలన జాబ్‌‌‌‌లాస్ అయితే కస్టమర్‌‌‌‌‌‌‌‌కు వారానికి గరిష్టంగా రూ. లక్ష వరకు శాలరీని ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీ చెల్లిస్తుంది. కస్టమర్ల నెట్‌‌‌‌ శాలరీకి తగ్గట్టు ఈ వీక్లీ శాలరీ ఉంటుంది. ఇది కూడా 100 వారాల వరకు ఇన్సూరెన్స్‌‌‌‌ కంపెనీ పే చేస్తుంది.

 

Latest Updates