యాదాద్రి గుడి స్తంభాలపై పొలిటికల్ చిత్రాలను తొలగించాం: ఆనంద్ వేలు

ఎట్టకేలకు యాదాద్రి ఆలయ స్తంభాలపై అభ్యంతరకర చిత్రాలను తొలగించారు. సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలతోపాటు.. నెహ్రు, గాంధీ, రాజీవ్, కమలం బొమ్మలతోపాటు చార్మినార్, తదితర చిత్రాలను కూడా తొలగించామన్నారు.. ఆలయ ప్రధాన స్థపతి ఆనంద్ వేలు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే తొలగించే చర్యలు చేపట్టామన్నారు. వాటి స్థానాల్లో ఆలయ సంప్రదాయ చిత్రాలను చెక్కే పనిని మొదలు పెట్టామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాటిని కూడా సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Latest Updates