ఈ కాఫీ హౌజ్ రాజకీయ చర్చలకు అడ్డా

చర్చిలా కనిపించే పాతకాలం నాటి బిల్డింగ్.. పైన ఇండియన్ కా ఫీ హౌస్ అనే రంగు వెలిసిన బోర్డు. కమ్మని కాఫీ వాసనతో పాటు వాడివేడి రాజకీయ చర్చలు బయటిదాకా వినిపిస్తాయి. అలా లోపలికి అడుగేస్తే కాస్త గోలగోలగానే ఉంటుంది. టేబుల్ చుట్టూ కుర్చీలు, చేతుల్లో కా ఫీ కప్పులతో కూర్చుని చర్చలు జరిపే కస్టమర్లు. కప్పులు ఖాళీ అవుతూనే ఉంటాయ్, ఆర్డర్ ​అందుకుని వెయిటర్లు తెస్తూనే ఉంటారు. కానీ ఆ చర్చలకు ముగింపనేది ఉంటుందా అనిపించేలా వాదనలు కొనసాగుతుంటాయ్. ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్‌ నగరం నడిబొడ్డున సివిల్‌​లైన్స్ లోని ఇండియన్ కాఫీ హౌస్ లో కనిపించే దృశ్యమిది. కాఫీ రుచికో, రాజకీయాలు చర్చించడానికో, తరాలుగా కొనసాగుతున్నందుకో.. కారణమేదైనా ఈ కాఫీ హౌస్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. దేశ ప్రధానుల నుంచి సామాన్యు ల దాకా ఇక్కడికి వచ్చేవారే. తొలి ప్రధాని నెహ్రూ, వీపీ సిం గ్ లతో పాటు అమితాబ్ బచ్చన్ ఇక్కడి కాఫీని మెచ్చు కున్నవారే. 1957 నుంచి కొనసాగుతున్న ఈ కాఫీ హౌస్ లో కాలంతో పాటు కొన్ని మార్పు లు వచ్చిచేరినా వెయిటర్ల యూనిఫాం నుంచి అన్నింటా అప్పటి అలవాట్లను నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. కాఫీ నెమ్మదిగా తాగుతూ రాజకీయాలపై అభిప్రాయాలను వెల్లడించడానికి ఇక్కడ ఎలాంటి అభ్యంతరం ఉండదు. గంటల కొద్దీ కాఫీ తాగుతూ పొలిటికల్‌‌ చర్చలు జరపడం  సర్వసాధారణం.

ఇదో చర్చా వేదిక….

ఈ కా ఫీ హౌస్ అంటే నే రాజకీయ చర్చలకు అడ్డా .మామూలుగానే చర్చలు గంటలతరబడి సాగుతుంటాయ్.. న్నికల సమయంలో అవి మరింత హీటెక్కుతాయి. పొద్దస్తమానం చర్చలు జరిగినా కా ఫీ హౌస్ లో ఏనాడు గొడవలు జరిగిన దా ఖలాల్లేవని మేనేజర్​ పీఆర్  పాండా చెప్పారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చర్చల వేడి పె రిగిందన్నా రు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు,కేంద్రం లో అధికారాన్ని ఏర్పాటు చేయబోయేది ఎవరు, ప్రియాంక రాక కాంగ్రెస్ దశ మా రుస్తుందా ?..తదితర అంశా లపై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెబుతుంటారు. దానిని సమర్థిం చుకునేందుకు తమ వాదనలు వినిపిస్తుంటారు. ఇందులో రిక్షా తొక్కే సామాన్యుడి నుంచి రాజకీయాల్లో తల పండిన వారూ ఉంటారు. కా లక్షేపానికి ఇంతకంటే మంచి ప్లే స్ మరేదీ ఉండదని రిటైర్డ్​ఉద్యోగులు చెబుతుంటారు. లాయర్లు, జర్నలి స్టులు, బిజినెస్ పీపుల్ కూడా ఇక్కడి చర్చల్లో పాల్గొంటారు.

Latest Updates