బాలీవుడ్ లో క్రూరత్వం : సుశాంత్ 6 నెలల్లో 7 సినిమాలు కోల్పోయాడు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లో ఆధిపత్య పోరేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు మద్దతుగా నెటిజన్లు #boycotbollywood యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  చిచోర్ విజయం తరువాత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఏడు చిత్రాలకు సంతకం చేశారు. అయితే ఆరు నెలల వ్యవధిలో  అవన్నీ కోల్పోయారు. ఎందుకు..? చిత్ర పరిశ్రమలో క్రూరత్వం తారాస్థాయికి చేరింది. . ఈ క్రూరత్వం అతని ప్రాణాలను తీసింది. మనం టాలెంటెడ్ నటుడిని కోల్పోయామని ట్వీట్ చేశారు.

Latest Updates