వ్యాపారంగా మారిన రాజకీయాలు

ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయాలు బలహీన పడ్డాయన్నారు TJAC అధినేత కోదండరాం. సూర్యాపేటలో TJAC కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం.. రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు. ఎంత పెట్టుబడి పెట్టి ఎంత సంపాదించుకున్నామనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో ఉన్న సమస్యలపై చర్చించి పోరాడే శక్తి రాజకీయాలకు లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు అప్రజాస్వామిక ధోరణిలో ఉన్నాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు వ్యాపారం కారాదని, సమస్యలపై నిజాయితీగా పోరాడే వ్యక్తులనే ప్రజలు ఎన్నుకోవాలని ప్రజలను కోరారు కోదండరాం.

 

Latest Updates