టర్కీ ఫస్ట్ లేడీని కలసిన ఆమిర్ ఖాన్‌.. ముసురుకుంటున్న వివాదం

న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కు వివాదాలు కొత్తేం కాదు. ఆయన పలుమార్లు కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారు. రాజకీయ వివాదాల్లో మాత్రం ఆమిర్ పేరు ఎప్పుడూ వినబడలేదు. అయితే తాజాగా టర్కీ ఫస్ట్ లేడీ ఎమినే ఎర్డోగన్‌ను ఆమిర్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా పనుల్లో బిజీగా ఉన్న ఈ హీరో.. దాని కోసమే టర్కీకి వెళ్లాడు. టామ్ హ్యాంక్స్ నటించిన ఫారెస్ట్ గంప్‌నకు రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా రూపొందుతోంది. కొంతమేర షూటింగ్ పూర్తయిన లాల్ సింగ్ చద్దా.. టర్కీలోనూ షూట్ జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా టర్కీ ప్రెసిడెంట్ రెకెప్ టయ్యిప్ ఎర్డోగన్‌ను ఆమీర్ కలిశారు. ఆమీర్‌‌ను కలిసిన విషయంపై ఎర్డోగన్ ట్వీట్ చేశారు. ‘ఆమిర్‌‌ ఖాన్‌ను కలవడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ప్రపంచానికి తెలిసిన ఇండియన్ యాక్టర్, ఫిల్మ్ మేకర్, డైరెక్టర్‌‌ ఇస్తాంబుల్‌లో ఉన్నారు. ఆమిర్ తన లేటెస్ట్‌ మూవీ లాల్ సింగ్ చద్దా షూటింగ్‌ను టర్కీలోని పలు ప్రాంతాల్లో తీయాలనుకోవడంపై నేను హ్యప్పీగా ఉన్నా. దీనికై నేను ఎదురు చూస్తున్నా!’ అని ఎర్డోగన్ ట్వీట్ చేశారు.

ఎర్డోగన్‌ను ఆమిర్ కలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఇండియాకు వ్యతిరేకంగా ఎర్డోగన్‌ పలుమార్లు విమర్శలకు దిగడమే దీనికి కారణం. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ముస్లింల సామూహిక ఊచకోతకు ఇండియా నిలయంగా మారిందని గత ఫిబ్రవరిలో ఎర్డోగన్ కామెంట్స్ చేశారు. ముస్లింలపై హిందువులు ఊచకోతకు పాల్పడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. కాశ్మీర్‌‌ విషయంలో ఆర్టికల్ 370 రద్దుపై కూడా ఇండియాకు వ్యతిరేకంగా ఆమె పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ నేషన్స్‌లో కూడా కాశ్మీర్‌‌ ఇష్యూపై ఆమె మాట్లాడారు. ఇండియన్ కాశ్మీర్‌‌లో 8 మిలియన్ల మంది ఇరుక్కుపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో యాంటీ ఇండియన్ అయిన ఎర్డోగాన్‌ను కలవడం దుమారాం రేపుతోంది. యాంటీ ఇండియా ఫోర్సెస్ పెరిగిపోతున్నాయని ఆమిర్‌‌పై విశ్వ హిందూ పరిషత్ విమర్శలకు దిగింది.

‘కొందరు వ్యక్తులు, నటులు యాంటీ–భారత్‌గా ఉన్న వ్యక్తులు, ఐకాన్స్‌ వైపు తొంగి చూస్తున్నారు. టర్కీ ఫస్ట్ లేడీని కలవడాన్ని ఓ యాక్టర్ గర్వంగా భావిస్తున్నారు. ఇది చాలా విషయాలను సూచిస్తోంది. ఏ నటులనైతే భారతీయ ప్రేక్షకులు ఆదరించారో వారిప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్న టర్కీ లాంటి దేశాల వారిని కలవడాన్ని గర్వంగా అనుకుంటున్నారు. ఇది భారతీయ ప్రేక్షకులను బాధ కలిగించడం మామూలే. దీని గురించి మనం ఆలోచించాలి. ఒక జఫారుల్ (ఇస్లాం ఖాన్) ఉండేవాడు. ఆయన మైనారిటీ కమిషన్‌కు చైర్మన్‌గా ఉండి ర్యాడికల్ ముస్లిం కంట్రీస్‌ తరఫున దేశానికి ముప్పు కలిగించాలని చూశాడు. ఇప్పుడు ఓ యాక్టర్ తన ఫిల్మ్ ప్రమోషన్ కోసం యాంటీ ఇండియా అయిన టర్కీకి వెళ్లాడు. వ్యూయర్స్ అన్నింటినీ అర్థం చేసుకుంటున్నారు’ అని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ ట్వీట్ చేశారు. టర్కీ మనకు కనిపించని పెద్ద శత్రువు అని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ట్వీట్ చేశారు. ఎర్డోగాన్‌ గానీ ఆయన పరిచయాలు గానీ ఎవర్నీ మనం నమ్మరాదని సింఘ్వీ చెప్పారు.

Latest Updates