బూత్ లోనే కుప్పకూలాడు : గుండె పోటుతో పోలింగ్ ఆఫీసర్ మృతి

బెంగళూరు : పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారి మృతి చెందిన సంఘటన కర్ణాటకలో జరిగింది. గురువారం రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. చామరాజనగర్ పోలింగ్ కేంద్రంలో డ్యూటీ చేస్తున్న ఎలక్షన్ ఆఫీసర్ శాంతిమూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు.  శాంతమూర్తి హనూరులోని ఓ కాలేజీ ప్రిన్సిపాల్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతమూర్తి చనిపోవడంతో పోలింగ్ ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. కర్ణాటకలో 14 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

Latest Updates