ఓట్లు వేయడానికి స్కూళ్లెందుకు? టెంట్లు చాలు!

ఒక దేశ భవిష్యత్తు క్లాస్​ రూమ్​లోనే డిసైడ్​ అవుతుందని కొఠారీ కమిషన్​ అప్పుడెప్పుడో 1964లోనే చెప్పింది. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని, దానికి క్లాస్​ రూమ్​ అన్ని విధాలా అనుకూలంగా ఉండాలని సూచించింది. కానీ.. ఇప్పుడు ఏం జరుగుతోంది? అఫ్ఘానిస్థాన్​లో క్లాస్​ రూమ్​లు మిలిటెంట్ల దాడిలో కూలిపోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు స్కూళ్లను వాడుకోవడం, డెమోక్రసీ వ్యతిరేకులైన మిలిటెంట్లు దాడులకు దిగడం పరిపాటిగా మారింది. అందుకే స్కూళ్లలో ఓటింగ్​ పెట్టొద్దని  ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్​ ఆన్​ సేఫ్​ స్కూల్స్​’ గట్టిగా చెబుతోంది.

ప్రపంచంలోని చాలా దేశాల్లో గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ ని; అంగన్ వాడీలను పోలింగ్ సెంటర్ లుగా, ఓటరు నమోదు కేంద్రాలుగా ఎప్పటి నుం చో ఉపయోగిస్తున్నారు. మన దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం, యూరప్ లో పార్లమెంటరీ ఎలక్షన్స్ నిర్వహణకు పాఠశాలలను వాడుకున్నారు. మెజారిటీ కంట్రీస్ లో ఈ ఓటింగ్ ప్రక్రియ ఎక్కువ శాతం సాఫీగానే సాగిపోయింది. పోలింగ్ కేంద్రాలు పొలిటికల్ , టెర్రర్ ఎటాక్ లకు పెద్దగా గురి కాలేదు. కానీ.. అఫ్ఘానిస్థాన్ తో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది.

అఫ్ఘానిస్థాన్​లో ఎన్నికల సందర్భంగా స్కూల్స్​పై దాడులు 2017–18లో మూడింతలు పెరిగాయని పోయిన వారం విడుదలైన యూనిసెఫ్ రిపోర్ట్​ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం.. గతంలో 68 ఎటాక్​లే చోటుచేసుకోగా అవి 2018లో 192కి పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో అఫ్ఘానిస్థాన్​లో ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్ జరగనున్నాయి. దీని కోసం​ ప్రభుత్వం మరోసారి స్కూళ్ల​నే పోలింగ్​ కేంద్రాలుగా వినియోగించటానికి సిద్ధపడుతోంది. దీంతో ఈ ప్రతీకార దాడుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందే తప్ప తగ్గే సూచనల్లేవు.్రపంచంలోని చాలా దేశాల్లో గవర్నమెంట్, ప్రైవేట్​ స్కూల్స్​ని; అంగన్​వాడీ​లను పోలింగ్​ సెంటర్​లుగా, ఓటరు​ నమోదు కేంద్రాలుగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. తాజా​గా మన దేశవ్యాప్తంగా లోక్​సభ ఎన్నికల కోసం, యూరప్​లో పార్లమెంటరీ ఎలక్షన్స్ నిర్వహణకు పాఠశాలలను వాడుకున్నారు. మెజారిటీ కంట్రీస్​లో ఈ ఓటింగ్​ ప్రక్రియ ఎక్కువ శాతం సాఫీగానే సాగిపోయింది. పోలింగ్​ కేంద్రాలు పొలిటికల్​, టెర్రర్​ ఎటాక్​లకు పెద్దగా గురి కాలేదు. కానీ.. అఫ్ఘానిస్థాన్​తోపాటు మరికొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది.

స్పెయిన్​లో ప్రత్యేక సదస్సు

గడచిన ఐదేళ్లలో 34 దేశాల్లోని ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్​పై 14 వేలకు పైగా ఎటాక్​లు జరిగాయని ‘థర్డ్​ ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్​ ఆన్​ సేఫ్ స్కూల్స్​’ తెలిపింది. యునెస్కో ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సదస్సు మే 27, 28, 29 తేదీల్లో స్పెయిన్​లో జరిగింది. ఇలాంటి ప్రమాదకర సంఘటనల నుంచి బడులను కాపాడుకోవాల్సిన విధానాలపై చర్చించి, తీర్మానం ఆమోదించటానికి అంతర్జాతీయ సమాజం భేటీ అయింది. కాన్ఫరెన్స్​లో పాల్గొన్న పలువురు ‘ఈ డిక్లరేషన్ ఎఫెక్టివ్​గా అమలవుతుందా’ అని అనుమానపడటం ఆయా దేశాల తీరుకి అద్దం పడుతోంది.

అఫ్ఘాన్​లో చదువుల పరిస్థితి పెనం మీద నుంచి పొయిలోకి పడేట్లు ఉందని యూనిసెఫ్​ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంగిత జ్ఞానం లేకుండా బడులపై దాడులకు పాల్పడటం, టీచర్లను ఎత్తుకెళ్లటం, తీవ్రంగా కొట్టి గాయపరచటం, చదువు చెప్పేవాళ్లను చంపుతామంటూ బెదిరించటం పెద్దఎత్తున జరుగుతున్నాయి. దీంతో స్కూల్​కి వెళ్లి నాలుగు ముక్కలు నేర్చుకోవాలనుకునే చిన్నారుల ఆశలు అడియాసలు అవుతున్నాయి. తమ పిల్లలను పెద్ద చదువులు చదివించుకోవాలనుకునే పేరెంట్స్​ కలలు కల్లలవుతున్నాయి’ అని యూనిసెఫ్​ తీవ్ర ఆవేదన వెలిబుచ్చింది.

అఫ్ఘాన్​లో 2014లో చేపట్టిన ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్స్​లో, 2018లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో స్కూల్స్​నే పోలింగ్​ బూత్​లుగా ఉపయోగించారు. ఆయా సందర్భాల్లో చోటుచేసుకున్న పొలిటికల్​, టెర్రర్​ ఎటాక్​ల వల్ల ఆ దేశంలో కిందటేడాది చివరి నాటికి వెయ్యికిపైగా స్కూల్స్​ మూతపడ్డాయి. ఐదు లక్షల మంది చిన్నారులు బడికి దూరమయ్యారు. క్రితంసారి వాడిన స్కూల్స్​లో చాలా మటుకు ఈసారి ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్​కీ కేటాయించాలని నిర్ణయించారు. నిరుడు స్కూల్స్​పై 192 దాడులు జ రిగితే అందులో 92 ఎన్నికలకు సంబంధించినవే.

తీర్మానానికి అన్ని దేశాలూ కట్టుబడాలి

సేఫ్​ స్కూల్స్​ డిక్లరేషన్​కి అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలని ‘అండర్​ సెక్రెటరీ జనరల్​ ఫర్​ హ్యుమనిటేరియన్​ అఫైర్స్​ అండ్​ ఎమర్జెన్సీ రిలీఫ్’​ కో–ఆర్డినేటర్ మార్క్​ లోకాక్​ సూచించారు. ‘సదస్సు తీర్మానంపై సంతకాలు చేసిన దేశాలు అందులోని బాధ్యతలన్నింటినీ నెరవేర్చాలి. లేకపోతే అవీ ఆఫ్గనిస్థాన్​ మాదిరిగానే బాధిత దేశాలవుతాయి. హామీలన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. అమలుకు నోచుకోవట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చదువులను కాపాడుకోవటం కష్టమే’ అని ఆయన హెచ్చరించారు.

స్కూల్స్​కి బదులు వేరే ప్లేస్​లు చూసుకోవాలి

స్కూల్స్​లో పోలింగ్​ బూత్​లు, ఓటరు రిజిస్ట్రేషన్​ సెంటర్లు పెట్టొద్దని వివిధ ఆర్గనైజేషన్లు డిమాండ్​ చేస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్​లో చాలా స్కూల్స్​ను ప్రస్తుతం ఆర్మ్​డ్​ ఫోర్సెస్​ ఆక్రమించాయి. అందువల్ల ఆ దేశంలో చదువును రక్షించాలంటే పోలింగ్​, ఓటర్​ రిజిస్ట్రేషన్ల​ కోసం వేరే ప్రదేశాలు  వెతుక్కోవాలని సూచిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను సపోర్ట్​ చేసేవాళ్లు ఓటింగ్​ కోసం ఆల్టర్నేటివ్​ ప్రదేశాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నాయి. కానీ.. అఫ్ఘానిస్థాన్​ సర్కారు ఈ డిమాండ్లను అంతగా పట్టించుకున్నట్లు కనబడట్లేదు.

మిలిటెంట్ల టార్గెట్​ని మార్చేయాలి

అఫ్ఘాన్​లో ఏబీసీడీలు​
వచ్చినోళ్లు 31 శాతమే

వరల్డ్​ బ్యాంక్​ అంచనాల మేరకు అఫ్ఘానిస్థాన్​​లో చదవటం, రాయటం వచ్చినోళ్ల శాతం 31 మాత్రమే. ప్రపంచంలో ఇంత తక్కువ లిటరసీ రేట్​ ఉన్న దేశాల్లో ఇదొకటి. ఆ దేశాన్ని 1996 నుంచి 2001 వరకు పాలించిన ఇస్లామిస్ట్​ తాలిబన్లు.. ఆడ పిల్లలు బడికి వెళ్లటాన్ని దాదాపు నిషేధించారు. లిటరసీ రేట్​ అతి తక్కువగా ఉండటానికి ఇదీ ఒక కారణమే. ఆఫ్గనిస్థాన్​లో 7 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న మొత్తం పిల్లల్లో సుమారు సగం (37 లక్షల) మంది స్కూల్స్​కి వెళ్లట్లేదని, బడి బయటే బతుకులీడుస్తున్నారని యూనిసెఫ్​ రిపోర్ట్​ వెలుగులోకి తెచ్చింది.

Latest Updates