ప్రారంభమైన రెండో విడత ఎలక్షన్ పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్. అస్సాంలో 5, బిహార్ లో 5, చత్తీస్ గఢ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 2, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, మణిపూర్ లో 1, ఒడిశాలో 5, తమిళనాడులో 38, త్రిపురలో 1, ఉత్తరప్రదేశ్ లో 8, బెంగాల్ లో 3, పుదుచ్చేరిలో 1 స్థానానికి ఇవాళ  పోలింగ్ జరుగుతోంది.

11 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో 95 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరు సౌత్ నియోజకవర్గంలోని జయానగర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అటు కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం శివగంగలోని కరైకుడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అటు చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం, ఆయన భార్య శ్రీనిధి రంగరాజన్ కూడా కరైకుడి పోలింగ్ స్టేషన్ లో ఓటేశారు. అటు చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ లోని పోలింగ్ కేంద్రంలో రజినీకాంత్ ఓటు వేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే సోలాపూర్ లో ఓటు వేశారు.

తమిళనాడులోని మొత్తం 39నియోజకవర్గాలకు రెండో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా… వెల్లూరు నియోజకవర్గంలో పోలింగ్ క్యాన్సిల్ చేసింది ఎలక్షన్ కమిషన్. అక్కడ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పోలింగ్ రద్దు చేసినట్టు తెలిపింది. తమిళనాడులోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఇవాళే జరుగుతున్నాయి.ఒడిశాలోని 5లోక్ సభ నియోజకవర్గాలతో పాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది.

రెండో విడతలో అనేక మంది కీలక నేతలు బరిలో ఉన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. తూత్తుకుడి నుంచి DMK నాయకురాలు కనిమొళి పోటీ చేస్తుండగా… ఆమెపై తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్ బరిలో ఉన్నారు. నీలగిరీస్ లో మాజీ టెలికం మంత్రి A రాజా, శివగంగలో కార్తి చిదంబరం, చెన్నై సెంట్రల్ లో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలో హేమామాలిని, ఫతేపూర్ సిక్రిలో UP PCC చీఫ్ రాజ్ బబ్బర్, అస్సాంలోని సిల్చార్ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్, జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఉదంపూర్ నుంచి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, కర్ణాటకలోని తుమకూరు నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ, మాండ్యలో సుమలతా అంబరీష్, ఆమెపై సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నారు.

Latest Updates