మధ్యాహ్నం ఒంటి గంట వరకు నమోదైన పోలింగ్ శాతాలు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయా రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్‌ శాతం… బీహార్‌లో 33.78 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఒడిశాలో 34 శాతం, అస్సాంలో 46.61, కర్ణాటకలో 36.66 శాతం, గోవాలో 45.11 శాతం పోలింగ్‌ నమోదైంది.

Latest Updates