మార్నింగ్ 5 గంటలకే పోలింగ్.. ECకి సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పోలింగ్​సమయంలో మార్పులు చేయాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. లోక్​సభ ఎన్నికల్లో మిగతా దశల పోలింగ్​ను తెల్లవారుజామున ఐదింటికే ప్రారంభించాలని పేర్కొంది. ఎండలతో పాటు ముస్లింల పవిత్ర మాసం రంజాన్​నేపథ్యంలో అవసరమైన మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అడ్వొకేట్​మహమ్మద్​నిజాముద్దీన్​పాషా, అసద్​హయత్​దాఖలు చేసిన రిట్​పిటిషన్ ​విచారించిన సీజేఐ జస్టిస్​ రంజన్ ​గొగొయ్​ నేతృత్వంలోని బెంచ్ ఈ సూచన చేసింది.

 

Latest Updates