క‌లుషిత‌ నీటితో ప్ర‌జ‌ల క‌ష్టాలు

హైద‌రాబాద్ – లాక్ డౌన్ క్ర‌మంలో ఇంట్లోనే ఉంటున్న ప్ర‌జ‌ల‌కు మంచి నీటి క‌ష్టాలు వెంటాడుతున్నాయి. అస‌లే ఎండాకాలం మంచినీరు స‌రిగ్గా రావ‌డంలేదు. అందులోనూ కొన్నిచోట్ల క‌లుషిత నీరు రావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

హైద‌రాబాద్ , ఉప్ప‌ల్ లోని చిలుకాన‌గ‌ర్ కాల‌నీలో ఆదివారం ఇలా క‌లుషిత వాట‌ర్ రావ‌డంతో ప్ర‌జ‌లు సీరియ‌స్ అవుతున్నారు. అస‌లే క‌రోనా నియంత్ర‌ణ‌లో బ‌య‌టికి వెళ్లొందంటున్నార‌ని.. మ‌రి మంచి నీళ్లు స‌రిగ్గా రాకుంటే ఏం తాగాలంటూ వాపోతున్నారు చిలుకాన‌గ‌ర్ కాల‌నీ వాసులు.

Latest Updates