పాకిస్తాన్‌, చైనాల వల్లే ఢిల్లీలో కాలుష్యం

యూపీ బీజేపీ నేత కామెంట్స్‌‌‌‌

మీరట్‌‌‌‌ (ఉత్తరప్రదేశ్‌ ): ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్‌‌‌‌ పెరిగిపోవడానికి పాకిస్తాన్‌‌‌‌, చైనాలే కారణమని యూపీ బీజేపీ నేత వినీత్‌ అగర్వాల్‌‌‌‌ ఆరోపించారు. ఈ రెండు పొరుగు దేశాలు మనదేశంలోకి విష వాయువులను వదిలిఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్‌‌‌‌ కు ఏం చేయాలో పాలుపోవడంలేదని, ఒక్క యుద్ధంలోనూ గెలవలేకపోవడంతో మనదేశానికి వ్యతిరేకంగా కుయుక్తులు పన్నుతోందని వినీత్‌ అగర్వాల్‌‌‌‌ అన్నారు. హర్యానా , పంజాబ్‌‌‌‌లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోందన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ ఆరోపణలను ఆయన తప్పుపట్టారు.

Latest Updates