కాలుష్యంలో హై‘దడ’బాద్‌

రాజధానిలో శ్రుతి మించుతున్న పొల్యూషన్‌

రోజురోజుకు హైదరాబాద్‌ లో కాలుష్యం పెరిగిపోతోంది. ఉండాల్సిన స్థాయికి మించి పార్టికు లేట్‌ మ్యాటర్‌ (పీఎం) ఎక్కు వవుతుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత కాలుష్య నగరంగా మారుతోంది. సెంట్రల్‌‌‌‌ పొల్యూషన్‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు (సీపీసీబీ) శనివారం సాయంత్రం 4 గంటలకు దేశంలోని 91 నగరాల ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌‌‌‌ (ఏక్యూఐ) వివరాలు విడుదల చేస్తే.. అందులో చెన్నై, తిరువనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం కన్నా హైదరాబాద్‌ లోనే కాలుష్యం విపరీతంగా ఉన్నట్టు తేలింది. మొత్తంగా దేశంలో 34 నగరాల కన్నా హైదరాబాద్‌ లో పరిస్థి తి దారుణంగా ఉంది. నగరంలోని గాలిలో పీఎం 2.5, పీఎం 10ల స్థా యి 105గా ఉందని సీపీసీబీ వెల్లడించింది. ప్రస్తుతం ‘మోస్తరు(మోడరే-ట్‌ )’ కేటగిరీలో నగరం ఉంది. ఈ స్థాయికి మించి కాలుష్యం పెరిగితే గుండె జబ్బులు, ఆస్తమా ఉన్న వారికి తిప్పలు తప్పవు. రోజుకు వెయ్యి కొత్త వాహనాలు హైదరాబాద్‌ లో గాలి కాలుష్యానికి ప్రధాన కారణం పరిశ్రమలు. అయితే అవి నగరానికి ఈశాన్యంలో ఉండటంతో వాటి ప్రభావం అంతగా ఉండదు.

మరి ఇంతలా కాలుష్యం పెరగడానికి కారణం?

వాహనాలు. రోజురోజుకు ఎక్కు వవుతున్న వాహనాల వల్లే నగరంలో కాలుష్యం పెరుగుతోందని ఎన్విరా న్‌ మెంటలిస్ట్‌‌‌‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన అరుణ్‌ కృష్ణమూర్తి చెప్పారు. నిర్మాణ కార్యకలాపాలూ మరో కారణమన్నారు. ఏదేమైనా వాహన కాలుష్యం ముందు మిగతావన్నీ బలాదూర్‌ అని చెబుతున్నారు. రంగారెడ్డి , సికిం ద్రాబాద్‌ లను కలుపుకొని హైదరాబాద్‌ లో సుమారు కోటి మంది నివసిస్తున్నారు. నగరంలో సుమారు 50 లక్షల వాహనాలున్నాయి. హైదరాబాద్‌ కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తున్నామని టీఎస్‌‌‌‌పీసీబీ చెప్పింది.

Latest Updates