క‌రోనాతో చ‌చ్చిపోతుంటే సెక్ర‌టేరియ‌ట్ అవ‌స‌ర‌మా..?

సీఎం కేసీఆర్ గారికి నూతన సెక్రటేరియట్ కట్టుకోవాలని ఆలోచన, తపన ఉంటే దానికి సమయం, సందర్భం అంటూ ఉంటుందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్ర‌భాక‌ర్. రాష్ట్రం, దేశం, ప్రపంచమంతా కరోనా బారినపడి ఇబ్బందికర పరిస్థితులలో ఉంటే, రోజు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక ఆర్థికంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగస్తులకు సగం జీతా లు చెల్లిస్తుంటే ఈ సమయంలో నూతన సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత‌ పొన్నం ప్రభాకర్. ఒకవైపు కరొన వ్యాధి ప్రబలుతుంటే కరోన నా కాకరకాయ నా అన్న మీరు దాని తర్వాత మిలటరీని దించుతం అని, కరొనాతో సహజీవనం చెయ్యాలని అంటున్న మీరు కరోనాతో సహజీవనం చేస్తున్నారా అని ప్రజలు అడుగుతున్నారన్నారు.

ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి తెలంగాణకి అన్నారు. ప్రగతి భవన్ పేరు మీద సెక్రటేరియట్ పేరు మీద ఇలా అన్ని పాత కట్టడాలు కూల్చివేస్తూ, కొత్తవి కట్టుకుంటూ తానేదో నూతన తెలంగాణ నిర్మాణం చేస్తున్నానని చెప్పుకోవడానికి చేసే ఈ ప్రయత్నం ప్రజాధనం దుర్వినియోగం తప్ప వేరొకటి కాదన్నారు. ఇప్పటికే రెండు లక్షల 90 వేల కోట్ల అప్పు అయింది, మళ్లీ కొత్తగా లక్షా యాభై వేల కోట్ల అప్పు తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలో దించి మొత్తం వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నార‌.. దయచేసి ప్రజలారా గమనించండన్నారు పొన్నం.

Latest Updates