మున్సిపల్ పోరులో టీఆర్ఎస్ బీజేపీ డూప్ ఫైటింగ్

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్, బీజేపీల స్నేహంపై  ఆధారాలున్నాయన్నారు.  అనేక బిల్లులకు మద్దతిచ్చి, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల విషయంలో అభద్రతా భావంలో ఉన్నారన్నారు.  కరీంనగర్, నిజామాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కుమ్ముక్కయ్యాయని ఆరోపించడం హాస్యాస్పదమన్నారు.  మున్సిపల్ ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కులేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతి యుతంగా ఉండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. కరీంనగర్ లో రెండు సీట్లలో సీపీఐకి మద్ధతునిస్తున్నామన్నారు .అభ్యర్థులను బెదిరించి, వేధిస్తూ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

 

Latest Updates