అమిత్‌ , పూజలకు పసిడి పతకాలు

Pooja, Amit bag gold at Asian Boxing C'ship
  • దీపక్‌ , బిష్త్‌ , ఆశీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిమ్రన్‌ కు రజతాలు
  • ఇండియా ఖాతాలో 13 మెడల్స్‌

బ్యాంకాక్‌ : ఇండియా స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘల్‌ మరోసారి సత్తా చాటాడు. ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ లో గోల్డ్‌ మెడల్‌ నెగ్గి ఈ ఏడాది రెండో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మహిళల విభాగంలో పూజా రాణి స్వర్ణం నెగ్గింది. పురుషులు, మహిళలకు ఒకేసారి నిర్వహించిన ఈ టోర్నీలో ఇండియా రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో అత్యధికంగా 13 పతకాలు గెలుచుకుంది.

చివరిరోజైన శుక్రవారం జరిగిన ఆరు ఫైనల్‌ బౌట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు మాత్రమే నెగ్గగా.. నలుగురు బాక్సర్లు ఓడిపోయారు. ఏషియన్‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమిత్‌ మాత్రం తన ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాడు. 52 కేజీల తుదిపోరులో 5–0తో కొరియాకు చెందిన కిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంక్యును చిత్తుగా ఓడించాడు. 2012 ఎడిషన్‌ సిల్వర్‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన 28 ఏళ్ల పూజ మహిళల 81 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గిన తొలి ఇండియన్‌ గా రికార్డు సృష్టించింది. ఫైనల్లో పూజ 4–1తో వరల్డ్‌ చాంపియన్‌ వాం గ్‌ లినా (చైనా)ను ఓడించిం ది. ఇప్పటిదాకా 75 కేజీల కేటగిరీలో ఆడిన పూజ.. 81 కేజీలకు మారిన తొలి ఏడాదిలోనే అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకోవడం విశేషం.

హర్యానాకు చెందిన పూజ తన తండ్రి వద్దన్నా కూడా బా-క్సింగ్‌ ను కెరీర్‌ గా ఎంచుకుం ది. అతడిని ఒప్పించేందు కుపూజా, ఆమె కోచ్‌ లు ఆరు నెలల పాటు బ్రతిమిలాడారు.2014 ఆసియా క్రీడల్లోనే కాం స్య గెలిచి తండ్రిని మెప్పిం-చిన పూజ.. తాజా పతకంతో అతను మరిం త గర్వపడేలాచేసిం ది.

అయితే, నేషనల్‌ చాంప్ దీపక్‌ సిం గ్‌ (49కేజీ),కవిం దర్‌ సిం గ్‌ బిష్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (56కేజీ), ఆశీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌ (75కేజీ),సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ (64కేజీ) తమ ఫైనల్​ బౌట్లలో ఓడిపోయిసిల్వర్‌ మెడ్సల్‌ తో సంతృప్తి పడ్డారు. సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గాయపడ్డకవిం దర్‌ తుదిపోరులో 0–5తో ఉజ్బెకిస్థా న్‌ బాక్సర్‌ మిరాజిబ్బెక్‌ చేతిలో ఓడగా, మక్రాన్‌ కప్‌ చాం పియన్‌ దీపక్‌2–3తో నొడిర్జన్‌ (ఉజ్బెకిస్థా న్‌ ) చేతిలో పోరాడి ఓడిపోయా-డు. ఆశీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌ 0–5తో కజకిస్థా న్‌ బాక్సర్‌ కులక్‌ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో చిత్తయ్ యాడు. సిమ్రన్‌ జిత్‌ 1-–4తో డాన్‌ డౌ (చైనా)చేతిలో ఓడిపోయింది.

Latest Updates