కరోనా అయితేం..సినిమా తరువాతే ఏదైనా

సినిమా కోసం హీరోయిన్ హీరోయిన్  పూజా హెగ్దే  గొప్ప సాహసమే చేసిందనే చెప్పుకోవాలి.   కరోనా వైరస్ దెబ్బతో దాదాపు  సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోతున్నాయి. నటీనటులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సినిమా షూటింగ్ కోసం  ప్రయాణాలంటే భయపడుతున్నారు. కానీ హెగ్దే మాత్రం సినిమాపై ఉన్న ప్రేమతో వరుస షూటింగ్ లతో బిజిబిజీ అయ్యారు.  

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 20వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.  పూజా హెగ్దే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్  కోసం చిత్ర యూనిట్ జార్జీయాకు తరలివెళ్లింది. ఈ సందర్భంగా పూజా హెగ్దే జార్జీయా విమానాశ్రయం లో ముఖానికి మాస్క్ వేసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రభాస్20 మూవీ షూట్‌లో పాల్గొనక తప్పలేదు. సినిమాపై ఉండే ప్రేమ కారణంగా కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. నేను జార్జియాకు ఇప్పుడే చేరుకొన్నాను. ప్రభాస్‌తో కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నాను అంటూ  ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టు నుంచి పూజా హెగ్డే ట్వీట్ చేసింది.

Latest Updates