పూనమ్‌ పాండే వైవాహిక జీవితంలో మరో ట్విస్ట్

తన భర్త సామ్‌ అహ్మద్‌ బాంబే పై పూనం పాండే భర్త సామ్ తనని శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డైరక్టర్ సామ్ ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు.

తాజాగా పూనమ్ పాండే మరో బాంబ్ పేల్చింది. టైమ్స్ ఇండియాతో మాట్లాడుతూ మా మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం చాలా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం పిచ్చి ప్రేమలో ఉన్నాం. వైవాహిక జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవని తెలిపారు. సామ్‌ బాంబే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ కలిసి ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు.

Latest Updates