పెళ్లై పది రోజులే.. భర్తపై కేసు పెట్టిన పూనమ్ పాండే

ముంబై: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే భర్త సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్‌‌గా పెళ్లి చేసుకున్న పూనమ్ పాండే పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తను కటకటాల్లో పెట్టించడం హాట్ టాపిక్‌‌గా మారింది. వివరాలు.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని పూనమ్ ఫిర్యాదు చేయడంతో సామ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌత్ గోవాలోని కనాకొనా గ్రామంలో ఒక మూవీ షూటింగ్‌‌లో పూనమ్ పాల్గొంటోంది. ఇక్కడే సామ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘భర్త సామ్ బాంబే తనను బెదిరిస్తున్నాడని, లైంగికంగా వేధిస్తున్నాడని పూనమ్ సోమవారం రాత్రి కంప్లయింట్ చేసింది. ఫిర్యాదు మేరకు అతణ్ని అరెస్ట్ చేశాం’ అని కనాకొనా పోలీస్ స్టేషన్ ఇన్‌‌స్పెక్టర్ తుకారం చవాన్ చెప్పారు. తక్కువ సినిమాలే చేసినప్పటికీ హాట్ హాట్ ఫొటోస్‌‌తో పూనమ్ క్రేజ్ సంపాదించింది.

Latest Updates