ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది

ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు అధికారులు రూల్స్ ను కట్టుదిట్టం చేస్తున్నా…ఏ మాత్రం పట్టించుకోవడం లేదు వాహనదారులు. భారీగా ట్రాఫిక్ చలానాలు విధించినా…వెహికిల్స్ ను సీజ్ చేసిన వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు. కొందరు వాహనదారులు ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిని కట్టడి చేసేందుకు మరో కొత్త రూల్ ను తీసుకురానుంది భీమా రెగ్యులేటర్ IRDAI. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో.. వారి వాహనం భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ తో మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను IRDAI  రెడీ చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమల్లోకి రానుంది. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను లెక్కలోకి తీసుకొని వాహనదారులకు ప్రీమియం నిర్ణయిస్తారు.

Latest Updates