పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ ‌‌ అవసరమా?

చెన్నై: తమిళనాడులోని విపక్ష డీఎంకే పార్టీకి చెందిన ఓ నేత పేద విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యానువల్ ఫీజులు కూడా కట్టలేని పేద విద్యార్థుకు ఎంబీబీఎస్ లాంటి కోర్సులు చదివే కోరికలు ఉండకూడదని డీఎంకే జనరల్ సెక్రటరీ దురైమురుగన్ అన్నారు. ‘ఎంబీబీఎస్ చేయాలని పేద విద్యార్థులు కలలు కనొద్దు. వార్షిక ఫీజుగా రూ.40 వేలు కట్టలేని వారు ఎంబీబీఎస్ చేయాలని ఎందుకు కలలుగనాలి?’ అని దురైమురుగన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగుతోంది. దురైమురుగన్ కామెంట్స్ చేసిన నెట్‌‌లో వీడియో వైరల్ అవుతోంది. సదరు కామెంట్స్‌‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకు వేలు ఫీజులు కట్టేందుకు దురైమురుగన్‌‌లా తమిళ ప్రజలు అవినీతిపరులు కాదని బీజేపీ స్పష్టం చేసింది.

Latest Updates