వీడియో వైరల్.. రింగును ముద్దు పెట్టుకోనివ్వని పోప్

క్యాథలిక్ చర్చ్ పోప్.. ఫ్రాన్ సిస్ కు చెందిన వీడియో వైరల్ అవుతుంది. ఇటలీ లోని లోరెటో క్యాథలిక్ చర్చ్ లో పోప్ ఫ్రాన్ సిస్ ను సంధర్శకులు కలిసారు. ఇందులో భాగంగా.. పోప్ చేతికున్న ఉంగరాన్ని ముద్దాడి వారి ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయంలో భాగంగా వస్తుంది. అయితే చర్చ్ కు వచ్చిన కొందరు.. పోప్ చేతి ఉంగరాన్ని ముద్దుపెట్టుకోగా.. మరి కొందరికి మాత్రం అది సాధ్యం కాలేదు. వారు ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటుండగా చేతిని వెనక్కి గుంజుకున్నాడు పోప్. ఈ విషయం పై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత ధోరణి పోప్ లాంటి వారికి ఉండకూడదని అంటున్నారు.

క్యాథలిక్ చర్చ్ లకు అధిపతిగా  మార్చ్ 2013 న ఫ్రాన్ సిస్ ఎన్నికయ్యారు. అప్పటినుండి ప్రాన్ సిస్.. పోప్ అధికారాన్ని చూపుతున్న ఒక వెండి ఉంగరాన్ని ధరిస్తారు. అది తాను పోప్ గా ఉన్నంత కాలం తనతోనే ఉంటుంది.

 

 

Latest Updates