హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ పొద్దునే షేక్‌పేట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఉప్పరపల్లిలో, మంత్రి మహమూద్ అలీ మలక్‌పేట్‌లో ఓట్లు వేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి దంపతులు సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓటేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్ రూరల్‌లోని వేలేరులో ఓటు హక్కను వినియోగించుకున్నారు. నర్సంపేటలో యువ తెలంలగాణ అభ్యర్థి రాణిరుద్రమ, తార్నాకలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఓటేశారు.
