వాట్సాప్ వీడియో కాల్స్‌లో పోర్న్

సోషల్ మీడియా అడ్డాగా ఆవారాగాళ్ళు రెచ్చిపోతున్నారు. అమ్మాయిల ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారు. చెప్పినట్టు వినకపోతే ఫొటోలు మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇలాంటిదే ఆన్ లైన్ అప్లికేషన్ల డేటాతో యువతులకు వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్న బ్లాక్ మెయిలర్ ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి వివరాలు వెల్లడించారు.

పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్

తను చెప్పినట్లు వినకపోతే తన వద్ద ఉన్న ఫొటోలను సోషల్ మీడియాతో పాటు పోర్న్ సైట్స్, వాట్సాప్ లలో  పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఇలా ఓ యువతిని వేధించాడు. దీంతో గతేడాది సెప్టెంబర్ 2న బాధిత యువతిని వేధించాడు. వాట్సాప్ లో న్యూడ్ చాటింగ్ కి రావాలని కాల్స్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు. 8125949377 నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ ను బాధితురాలు అటెండ్ చేయలేదు. దీంతో ఆ యువతి పేరుతో ఫోన్ లిఫ్ట్ చేయాలని మెసేజ్ పెట్టాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. దీంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ పోర్న్ వీడియోలను పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటిదే 2007 లో నమోదైన కేసులో కందగట్ల భాస్కర్ కు జనగాం కోర్ట్ రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది. జైలు నుంచి విడుదలైన తరువాత కూడా యువతులను న్యూడ్ ఫోన్ కాల్స్ తో బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ టీమ్ దర్యాప్తు జరిపింది. భాస్కర్ ను మంగళవారం అరెస్ట్ చేసి మొబైల్ రికవరీ చేశారు. బాధితుల ఫోన్ నంబర్స్ తో పాటు ఫొటోలు పోర్న్ వీడియోలతో కూడిన చాటింగ్స్ డేటాను సీజ్ చేశారు.

Latest Updates