బస్టాండ్ లో వాష్ బేసిన్..చేతులు కడిగాకే బస్సెక్కాలె

  •     కరోనా లేకున్నా పబ్లిక్​ ప్లేసెస్​లో వాష్​బేసిన్లు పెట్టించిన రువాండా 

అది ఆఫ్రికన్ దేశం రువాండా రాజధాని కిగాలి. సిటీలోని మెయిన్ బస్టాండ్​లో బస్సులెక్కనింకె వచ్చినోళ్లంతా ముందుగా చేతులు కడుక్కుంటున్నరు. అందుకోసం ఆల్రెడీ అక్కడక్కడా వాష్​బేసిన్లు పెట్టిన్రు. ప్యాసింజర్లు సక్కగా పోయి శానిటైజర్​ను రుద్దుకుంటున్నరు. కాలితో ఓ బటన్ లాంటిదాన్ని తొక్కగానే ట్యాప్ నుంచి నీళ్లొస్తున్నయి. ట్యాప్ ను ముట్టకుండానే చేతులు కడుక్కుని బస్సెక్కుతున్నరు. కేవలం బస్ స్టాండ్లలోనే కాదు.. ప్రతి పబ్లిక్ ప్లేస్​లోనూ ఇలా పోర్టబుల్ వాష్​బేసిన్లు, శానిటైజర్లను ఆ దేశ హెల్త్ అధికారులు సిద్ధంగా ఉంచుతున్నారు. అయితే, ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా ఆ దేశంలో నమోదు కాలేదు. అయినా, ఆ దేశ సర్కారు తీసుకుంటున్న ముందుజాగ్రత్తలను చూసి నెటిజన్లు శెభాష్ ​అంటున్నరు. అన్ని దేశాలూ ఇసొంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా లాంటి వైరస్ లను ఎక్కడికక్కడే ఖతం చేయొచ్చని చెప్తున్నరు. అయితే, ఇండియాలాంటి పెద్ద దేశంలో ఇసొంటివి కష్టమని, జనమే ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే మేలని కొందరు కామెంట్స్ చేస్తున్నరు.

Latest Updates