ఎన్నికల కోసమే పవన్ KCRను తిడుతున్నారు : పోసాని

తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు పోసాని..”తెలంగాణలో ఆంద్రులను కొడుతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను జగన్మోహన్ రెడ్డి భుజాలపై ఎత్తుకుంటున్నారు అంటున్నాడు. గతంలో కేసీఆర్ ను ఆంధ్రా వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని గతంలో చెప్పారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ఎన్నికల కోసం కేసీఆర్ ను తిడుతూ మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఒక్క ఆంధ్ర వాళ్లనైన తెలంగాణలో కొట్టారు అని పవన్ కళ్యాణ్ చూపించగలరా. ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రా వాళ్లనే కొడుతున్నారు. వాళ్ళ తరుపున ఎందుకు మాట్లాడడం లేదు.

పవన్ కళ్యాణ్ మాటలు విని నిజంగానే ఆంధ్ర వాళ్ళను.. తెలంగాణ వాళ్ళు కొడితే నువ్వు వచ్చి కాపాడతావా. నీ మాటలు నమ్మి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి తెలంగాణ వాళ్ళు వస్తే, ఆంధవాళ్ళు కొడితే ఏం చేస్తావ్. పవన్ కళ్యాణ్ రెచ్చకొట్టే  మాటలు మాట్లాడ కూడదు. రెచ్చ కొట్టే మాటలు మాట్లాడితే.. మేము చచ్చిపోతాం. గతంలో జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో చేసిన వ్యాఖ్యలను నేను సమర్దిస్తున్నాను” అని తెలిపారు పోసాని.

Latest Updates