రాష్ట్రంలో 23 రోజుల పసికందుకు పాజిటివ్

మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా నమోదైన మూడు కేసులు కూడా మర్కజ్ నుండి వచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకినట్లుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు కేసులలో 23 రోజుల పసికందు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ క్ర‌మంలో బికే రెడ్డి కాలనీ, మర్లు ప్రాంతాలనుండి రాకపోకలను పరిమితం చేయటమే కాకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను పిచికారి చేయించినట్లు చెప్పారు.

ఈ రెండు ప్రాంతాలలోని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తిస్తున్నామని, అలా గుర్తించిన వారందరిని ప్రభుత్వ క్వారన్ టైన్ లో ఉంచుతున్నట్లు తెలిపారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని అన్ని ప్రాంతాల రహదారులలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కలెక్టర్.

Latest Updates