ప్రెసిడెంట్ ప్యాలెస్ లో కరోనా కలకలం

20 మంది ఉద్యోగులకు వైరస్
కాబూల్:
ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిందని అక్కడి సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ఉద్యోగులలో ఎవరితోనైనా సంప్రదింపులు జరిపాడా.. తాను కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ప్రెసిడెంట్ ప్యాలెస్ దీనిపై కామెంట్ చేసేందుకు నిరాకరించింది. అష్రఫ్ ప్రతిరోజు కొంతమంది సీనియర్ అధికారులను కలుస్తున్నప్పటికీ ప్యాలెస్ లో ఆయన ఒంటిరిగానే ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కేన్సర్ ట్రీట్ మెంట్ తీసుకున్న 70 ఏళ్ల వయసున్న అష్రఫ్ కు కరోనా సోకితే హై రిస్క్ కేటగిరీగా పరిగణించాల్సి ఉంటుందని నిఫుణులు చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటివరకు 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం చెప్తోంది. కానీ, గడిచిన రెండు నెలల్లో 200,000 మందికి పైగా ఆఫ్ఘన్లు ఇరాన్ నుంచి తిరిగి వచ్చారని అక్కడి ఇంటర్నేషనల్ ఆఫీస్​ ఆఫ్ మైగ్రేషన్ ప్రకటించింది. ఇరాన్ లో ఇప్పటికే 82,000 వైరస్ కేసులు నమోదు కాగా 5,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇరాన్ నుంచి వచ్చిన చాలామంది ఆఫ్ఘాన్ అంతటా విస్తరించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Latest Updates