రెండో చందమామను గుర్తించిన రీసెర్చర్లు

మనకు ఇప్పుడు ఇద్దరు చందమామలు ఉన్నరంట. కొత్త చంద్రుడు మూడేండ్ల కిందనే చుట్టపుచూపుగా వొచ్చిండంట. ఇప్పుడు భూమి చుట్టే తిరుగుతున్నడంట. భవిష్యత్తులో మళ్లా తన దారిన తాను పోతాడంట. ఏంటీ.. ఆశ్చర్యంగా ఉందా? అవును. మూడు మీటర్ల సైజు ఉన్న ఓ ఆస్టరాయిడ్‌‌‌‌ను మన భూమి తనవైపు లాక్కుందని, అది చంద్రుడిలాగా మెరుస్తూ భూమి చుట్టూ తిరుగుతోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. కేటలినా స్కై సర్వే ద్వారా భూమికి దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్లను పరిశీలిస్తుండగా.. ఫిబ్రవరి15న ఆస్ట్రానమర్లు దీనిని కనుగొన్నారు. రెండు రోజుల్లో ఇది నాలుగు సార్లు కనిపించింది. దీనికి ‘2020 సీడీ3’ అని పేరు పెట్టారు. కార్బన్ ఎక్కువగా ఉండే సీ టైప్ ఆస్టరాయిడ్ అయినందున ఇది మెరుస్తూ ఉందని సైంటిస్టులు తెలిపారు. ఇప్పటిదాకా లక్షలాది ఆస్టరాయిడ్లను గుర్తించినా, భూమికి దగ్గరగా వచ్చింది మాత్రం ఇదేనంట.

Latest Updates