ఖననం చేసిన డెడ్ బాడీకి పోస్టు మార్టం

ఖమ్మం జిల్లా, వెలుగు: ఖననం చేసిన డెడ్ బాడీని పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. జూలూరుపాడు మండలంలోని బొజ్యాతండాకు చెందిన గుగులోతు శివ(13) గురువారం మధ్యాహ్నం తన తండ్రి మందలించినందుకు పురుగుల మందు తాగాడు. కొత్తగూడెం ప్రభుత్వా సుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతదేహాన్ని మార్చురీ గదిలో ఉంచగా.. మృతుడి కుటుంబీకులు పోస్టుమార్టం చేయకుండానే తమ స్వగ్రామానికి తీసుకెళ్లి అదేరోజు రాత్రి ఖననం చేశారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు శుక్రవారం ఖననం చేసిన ప్రదేశానికి వెళ్లి డెడ్ బాడీని బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates