“అల..వైకుంఠపురం”లో అమ్మ వచ్చేసింది..!

కూలీ నెం-1 సినిమాతో కలయా ..నిజమా అంటూ కుర్రాళ్లకు నిద్రలేకుంటా చేసిన ఎవర్ గ్రీన్ బ్యూటీ టబు.. చాలా రోజుల తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ లో వస్తున్న క్రేజీ, హ్యాట్రిక్ మూవీ `అల‌..వైకుంఠ‌పుర‌ములో… కీలక పాత్రలో నటిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్.

ఈ రోజు టబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఆమె లుక్ రిలీజ్ చేసింది యూనిట్. హ్యాపీ బర్త్ డే ఎవర్ గ్రీన్ టబు అని ట్వీట్ చేసింది. ఈ మూవీలో బ‌న్నీకి అమ్మ పాత్ర‌లో టబు న‌టిస్తుంద‌ని టాక్. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇప్ప‌టికే సినిమాలోని రెండు పాట‌లు విడుదల చేసి, సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యూనిట్..ఇవాళ టబు పోస్టర్ రిలీజ్ చేసి, సినిమాపై అంచనాలను పెంచేసింది. మిడిల్ ఏజ్ వచ్చినా వన్నె తగ్గలేదంటున్నారు నెటిజన్లు. టబు ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి బన్నీకి అమ్మలా టబును ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో..!

Latest Updates