ఏపీలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్, లా సెట్, ఈ సెట్, పీజీ సెట్ సహా 8 ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ ఎంట్రన్స్ టెస్టులను సెప్టెంబరు మూడో వారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రవేశ పరీక్షల కొత్త తేదీలతో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి సురేశ్ తెలిపారు. అయితే, విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే జాతీయస్థాయిలో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయన్నారు.

Latest Updates