బంగారు నగలకు హాల్ మార్కింగ్ వాయిదా

న్యూఢిల్లీ: గోల్డ్‌ జ్యువలరీకి హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరనే నిబంధన అమలుకు గడువును 2021 జూన్‌ 1 దాకా పొడిగించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కన్జూ మర్‌ ఎఫైర్స్‌‌ మంత్రి రామ్‌ విలాస్‌ పశ్వాన్‌ సోమవారం వెల్లడించారు. గోల్డ్‌ జ్యువలరీకి ప్రస్తుతం హాల్‌ మార్కిం గ్‌ తప్పనిసరి కాదు. ఆభరణాలలోని బంగారపు ప్యూరిటీ (స్వచ్ఛత)ని ఈ హాల్‌ మార్కిం గ్‌ తెలియచేస్తుంది. దేశ వ్యాప్తంగా ఆభరణాలన్నింటికీ హాల్‌ మార్కిం గ్‌ తప్పనిసరని గత ఏడాది నవంబర్‌ లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను జనవరి 15, 2021 నుంచి అమలులోకి తేనున్నట్లు ప్రకటించింది.

జ్యువలర్స్‌‌కు దాదాపు ఏడాదికి పైనే గడువును ప్రభుత్వం ఇచ్చింది. కాకపోతే, కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ గడువును పొడిగించాలని జ్యువలర్స్‌‌ కోరారు. దాంతో ఈ గడువును పొడిగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి దేశంలో 14, 18, 22 కేరట్ల గోల్డ్‌ జ్యువలరీని మాత్రమే అమ్మాలని ఆయన పేర్కొ న్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా మూడు నెలలు నష్ట పోవడంతో గడువు పొడిగిం చాలని ఆల్‌ ఇండియా జెమ్‌ అండ్‌ జ్యువలరీ డొమెస్టి క్‌ కౌన్సిల్‌ (ఏజీజేడీసీ) ప్రభుత్వా న్ని కోరిం ది. లాక్‌ డౌన్‌ టైములో అమ్మకాలు, ఆపరేషన్స్‌‌ లేవని ఏజీజేడీసీ వైస్‌ ఛైర్మన్‌ శాం కర్‌ సేన్‌ ఇటీవలే వాపోయారు.

గోల్డ్‌ జ్యువలరీ కోసం ఏప్రిల్‌ 2000 నుం చే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాం డర్డ్స్‌ (బీఐఎస్‌ ) ఒక స్కీమును నిర్వహిస్తోంది. దాదాపు 40 శాతం గోల్డ్‌ జ్యువలరీ హాల్‌ మార్క్‌‌తో దేశంలో దొరుకుతోం ది. దేశంలోని 28,849 మంది జ్యువలర్స్‌‌ బీఐఎస్‌ వద్ద రిజిస్టర్‌ చేసుకున్నారు. కస్టమర్లు నష్టపోకుండా ఉండేందుకు గోల్డ్‌ జ్యువలరీ హాల్‌ మార్కింగ్‌ రూల్‌ ఉపయోగపడుతుందని బీఐఎస్‌ చెబుతోంది.

Latest Updates