ఆలుగడ్డ చర్మాన్ని మెరిపిస్తుంది…

ఆలుగడ్డ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతుంది. జుట్టు నుంచి కళ్ల వరకు ఎన్నో సమస్యలకి  చెక్​ పెడుతుంది. ఆలుగడ్డలో ఉండే విటమిన్– బి6 , సి లు  చర్మాన్ని మెరిపిస్తాయ్​. కళ్లకింద నల్లటి వలయాలను తగ్గిస్తాయ్​​. అంతేకాదు బోలెడన్ని చర్మ  సమస్యల్ని  దూరం చేస్తాయ్​.

నేచురల్ బ్లీచ్

చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తే   ఆలుగడ్డ గుజ్జులో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముడతలు మాయం

ఆలుగడ్డ  రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి ఆలుగడ్డ రసాన్ని రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆలుగడ్డ గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి మాస్క్ వేసి, పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా రెగ్యులర్​గా చేస్తే ముడతలు పోతాయ్​.

మెరిసే చర్మం

ఆలుగడ్డ గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, తెల్లగా అవుతుంది. ఆలుగడ్డ  రసంలో కొంచెం నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగితే చర్మం రంగు తేలుతుంది.

నల్లటి వలయాలకి చెక్​

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, కళ్లు ఉబ్బడం లాంటి సమస్యలకు ఆలు చాలా బాగా పనిచేస్తుంది. ఆలుగడ్డ  రసంలో దూది ముంచి, కళ్లపై పావుగంట ఉంచితే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే ఆలుగడ్డ గుజ్జు​లో తేనె కలిపి కంటి చుట్టూ రాయాలి.

మచ్చలకు

చర్మంలో అక్కడక్కడా కనిపించే మచ్చలకు ఆలుగడ్డతో  చెక్​ పెట్టొచ్చు. ఆలుగడ్డ  గుజ్జుని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత  శుభ్రం చేస్తే నల్లమచ్చలు తగ్గుతాయి. ఇలా 25 రోజుల పాటు ప్రతిరోజూ చేయాలి.

టోనర్

ఆలుగడ్డ పేస్ట్ లో కొద్దిగా కీరదోస రసం  కలిపి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.

మెరిసే జుట్టుకు..

ఆలుగడ్డ రసంలో కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు మెరుస్తుంది.  అలాగే ఆలుగడ్డ  తొక్కని నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లతో తలస్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు కూడా తగ్గుతాయి.

సన్​బర్న్​కి చెక్​

ఆలుగడ్డ  చర్మం మీద గాయాలను, చర్మ సమస్యలను నయం చేస్తుంది. సన్ బర్న్ కూడా నివారిస్తుంది. ఆలుగడ్డను గుండ్రంగా కోసి  ముఖంపై మర్దన చేస్తే ట్యాన్​ సమస్య నుంచి బయటపడొచ్చు.

Latest Updates