ప్లాస్టిక్ నుంచి కరెంట్ తయారీ

    ముందు ఫార్మిక్ యాసిడ్.. తర్వాత పవర్

    సింగపూర్ సైంటిస్టుల ప్రయోగం

భూమిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. సముద్రంలోనూ డంప్ చేస్తున్నాం. ప్రమాదకరంగా మారుతున్న  ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే, ప్లాస్టిక్ ను పూర్తిగా రీసైకిల్ చేసి, ఫార్మిక్ యాసిడ్ తయారు చేయడమే కాకుండా, దానితో పవర్ ప్లాంట్లలో కరెంట్ తయారీకి కూడా ఉపయోగపడే ప్రాసెస్ ను సైంటిస్టులు కనుగొన్నారు. సూర్యరశ్మిని వాడుకుని, ఆరు రోజుల్లో ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చని సింగపూర్ లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సైంటిస్టులు వెల్లడించారు. ఇతర పద్ధతుల్లో ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయాలంటే శిలాజ ఇంధనాలను వాడాల్సి వస్తుందని, దాంతో గ్రీన్ హౌజ్ వాయువులు విడుదలై పర్యావరణానికి మళ్లీ హాని కలుగుతుందని వారు తెలిపారు. ఈ పద్ధతిలో పర్యావరణానికి మేలు కలగడమే కాకుండా, ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి చిన్నమొత్తంలోనే ప్లాస్టిక్ ను రీసైకిల్ చేసి, ఫార్మిక్ యాసిడ్ గా మార్చామని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రాసెస్ చేపట్టేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నామని సైంటిస్టులు వెల్లడించారు.

Latest Updates