సెక్సియేస్ట్ మ్యాన్ ఆఫ్ 2019 లిస్టులో ప్రభాస్

బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన  ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్టర్న్ ఐ సంస్థలు కలిసి చేసిన సర్వేలో ప్రభాస్ కు అరుదైన ఘనత దక్కింది. ఆసియాలో సెక్సియేస్ట్ ఏసియన్ మ్యాన్  ఆఫ్ 2019 జాబితా లో ప్రభాస్ 10వ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్  స్టార్ ప్రభాస్ కావడం విశేషం. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ మొదటి స్థానంలో ఉండగా సౌత్ ఇండియాలో ప్రభాస్ 10 వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Latest Updates