ప్రభాస్ కొత్త మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ?

 

థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయనే విషయంపై ఎలాంటి క్లా రిటీ లేకున్నా ఇప్పటికే ప్రారంభించిన సినిమాల షూటింగ్స్ పూర్తి చేసి నిర్మాతలకి ఎంతో కొంత ఆర్థికభారం తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు హీరోలు, దర్శకులు. దీంతో వచ్చే నెల నుండి స్టా ర్ హీరోల సినిమాల షూటింగ్స్‌‌‌‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ తాజా చిత్రం కూడా ఈ నెలాఖరులో లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్‌ లో సెట్స్ కి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అరవై ఏళ్ల క్రితం నాటి పీరియాడికల్‌ సబ్జెక్టుతో రూపొందుతోంది, ‘రాధే శ్యామ్‌ ’ అనే టైటిల్ దాదాపు ఖరారయింది లాంటి రకరకాల వార్తలు ఈ సినిమా గురించి వస్తున్నాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ ప్యాన్‌ ఇండియా సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఓవైపు ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే మరో ప్రశ్న పలకరిస్తోంది. ఆమధ్య అమిత్ త్రివేది పేరు వినిపించినా తాను కాదని స్వయంగా క్లా రిటీ ఇచ్చాడు. దీంతో ‘సాహో’ తరహాలోనే ఒక్కో పాట ఒక్కో సంగీత దర్శకుడితో చేయించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. సినిమా సక్సెస్ లో సంగీతం కీలకపాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. పైగా ఇది ప్యాన్‌ ఇండియా సినిమా కూడా కావడంతో ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చేదెవరనే ఇంట్రెస్ట్ కామన్.

Latest Updates