ఓవర్సీస్ లో “సాహో” అనిపిస్తున్న కలెక్షన్లు

ప్రభాస్ ప్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సాహో ఇవాళ ప్రేక్షకులముందుకు వచ్చింది. సుజీత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించింది. సినిమా టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో మాత్రం సాహో అనిపిస్తోంది. ఓవర్సీస్ లో ఒక్కరోజే మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. శని, ఆది వీకెండ్ కావడంతో మరిన్ని కలెక్షన్స్ రావడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. హాలీవుడ్ లెవల్ లో సాహాలో యాక్షన్ సీన్స్ ఉండటంతో ఓవర్సీస్ లోనూ అదరగొడుతుందని టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేసి ప్రేక్షకులతో పంచుకుంది యూనిట్.

Latest Updates