బ్యాంగ్ బ్యాంగ్… ప్రభాస్ ‘సాహో’ ట్రైలర్ రిలీజ్

prabhas-saaho-official-trailer-released

యంగ్ రెబల్ స్టార్, ఇండియన్ సినిమా బాహుబలి.. ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో సినిమా ట్రైలర్ విడుదలైంది. మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ట్రైలర్ ను విడుదల చేశారు. ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది ఈ సినిమా. 

గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు… గ్రౌండ్ లో కొట్టినోడికే ఓ రేంజ్ ఉంటది అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్.. యాక్షన్ సీక్వెన్సెస్… సినిమా రేంజ్ ను చెప్పకనే చెబుతున్నాయి. అత్యంత భారీ స్థాయి హంగులతో సాహో రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కొండల లోయల్లోకి ప్రభాస్ జంపింగ్స్, జెట్ ప్యాక్ తో స్కై రైడ్…. మల్లయోధులతో మాస్ ఫైట్.. బైక్ స్టంట్స్.. కార్ చేజెస్… ఇలా.. చూసేందుకు సినిమాలో చాలా సరుకు ఉందని… వాటన్నింటినీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రైలర్ లో చూపించారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా … ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం అని మేకర్స్ చెబుతున్నారు.

ప్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేశ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, ఎవ్ లిన్ శర్మ, సుప్రీత్, లాల్, చుంకీ పాండే, మందిరాబేడీ, మహేశ్ మంజ్రేకర్, టినూ ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. 

Latest Updates