థాంక్యూ డార్లింగ్

ప్రేక్షకులే కాదు, టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడే హీరో ప్రభాస్. అతడు అందరినీ డార్లింగ్ అంటుంటాడు. అతణ్ని అందరూ డార్లింగ్‌ హీరో అంటూ ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు ప్రభాస్ చేసిన ఒక పనితో అతడి మీద గౌరవం మరింత పెరిగిపోయింది జనాలకి. మరో మూడు వారాల్లో ‘సాహో’ రానుంది. అయితే దాని రాక చాలామందిని కంగారు పెట్టిందనే చెప్పాలి. అంత పెద్ద సినిమా సమయంలో తమ సినిమా వస్తే ఎలా అని టెన్షన్ పడ్డారు. సాహో రిలీజ్ డేట్ మారడంతో మరి కొన్ని సినిమాలకి ఇబ్బంది వచ్చింది. దాంతో ఆ దర్శక నిర్మాతలంతా తమ సినిమాలను రీ షెడ్యూల్ చేసుకున్నారు. రిలీజ్ డేట్స్‌ మార్చుకుని సాహోకి దారిచ్చారు. దాంతో వారికి కృతజ్ఞతలు చెప్పింది మూవీ టీమ్.

మా సినిమాకి భారీ రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో తమ సినిమాల తేదీలను మార్చుకున్న ప్రతి స్టార్‌ కి, నిర్మాతకి థ్యాంక్స్, మీ సినిమాలన్నీ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామంటూ ఒక లేఖ విడుదల చేసింది. అలాగే ప్రభాస్ కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపాడు. నిజానికి ఇలా చేయాల్సి న అవసరం లేదు. అయినా పనిగట్టుకుని చెప్పేసరికి… వారి వినమ్రతకి అందరూ హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. నీ అభిమానానికి థాంక్యూ డార్లింగ్ అంటున్నారు.

Latest Updates