ప్రభుదేవా మ్యారేజ్‌‌ పుకార్లపై క్లారిటీ

చెన్నై: ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు ప్రభుదేవా పెళ్లిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ డాక్టర్‌‌ను ప్రభుదేవా వివాహం చేసుకున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ప్రభుదేవా సోదరుడు, డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం క్లారిటీ ఇచ్చారు. ‘మీ దగ్గర కొన్ని వివరాలు ఉన్నాయి. ప్రభుదేవా మ్యారేజ్‌‌పై మేం చాలా హ్యాపీగా ఉన్నాం’ అని నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజు సుందరం స్పష్టం చేశారు.

ముంబైకి చెందిన ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ హిమానీని ప్రభుదేవా పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభు-హిమానీలు రెండు నెలలకు పైగా లివ్-ఇన్ రిలేషన్‌‌షిప్‌లో ఉన్నారని సమాచారం. లాక్‌‌డౌన్ రూల్స్ పాటిస్తూ మే నెలలో చెన్నైలో ప్రభుదేవా వివాహం జరిగిందని తెలుస్తోంది. తాజాగా రాజు సుందరం స్పష్టతను ఇవ్వడంతో ప్రభు మ్యారేజ్‌‌పై వస్తున్న వార్తలు నిజమేనని చెప్పొచ్చు. ప్రభుదేవా తొలి భార్య రమాలత అన్న విషయం తెలిసిందే. రమాలతతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ దక్షిణాది హీరోయిన్ నయనతారతో ప్రభు ప్రేమాయణం నడిపారని గుసగుసలు వచ్చాయి. అయితే వీరి బంధం పెళ్లి పీటల దాకా వెళ్లలేదు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌‌తో నయన్ రిలేషన్‌‌షిప్‌‌లో ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి.

Latest Updates