క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇండియన్ బౌలర్

భారత స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తాను తర్వాతి స్టేజీలోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందంటూ పేర్కొంటూ తన రిటైర్మెంట్ గురించి ఓజా తెలియజేశాడు. ఓజా భారత్ తరపున వన్డే మ్యాచ్‌లలో జూన్ 28, 2008 బంగ్లాదేశ్‌పై మొదటి మ్యాచ్ ఆడాడు. 2012 నుంచి అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉన్న ఓజా.. 2019 వరకు దేశీయ మ్యాచ్‌లలో పాల్గొన్నాడు.

2014 డిసెంబర్‌లో ఓజా బౌలింగ్ నిబంధనలకు విరుద్ధమని అతని బౌలింగ్ నిషేధించబడింది. ఆ నిషేధాన్ని జనవరి 30, 2015న అధిగమించి తాను బౌలింగ్‌ చేయడానికి తిరిగి అనుమతిని తెచ్చుకున్నాడు.

ఓజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన బౌలింగ్ సత్తాతో నెంబర్ 5 స్థానాన్ని కూడా సంపాదించాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలో పర్పుల్ క్యాప్ అందుకున్న మొదటి స్పిన్నర్‌గా కూడా తన పేరు నమోదు చేసుకున్నాడు.

ఓజా ఐపీఎల్‌‌లో దక్కన్ చార్జర్స్ మరియు ముంబాయి ఇండియన్స్ తరపున ఆడాడు. ఇండియా తరపున 24 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 18 వన్డే మ్యాచులు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి ఓజా 113 వికెట్లు పడగొట్టాడు.

For More News..

మాఫియా డాన్ శివశక్తి నాయుడు ఎన్‌కౌంటర్

మహిళల హాకీ మాజీ కెప్టెన్‌‌కు వరకట్న వేధింపులు

వైరల్ వీడియో: నౌకర్లతో కలిసి ఓనర్ స్టెప్పులు

Latest Updates