వాట్సప్ లో…. ప్రజావాణి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కరోనా కారణంగా ఈ నెల 3 నుం చి వాట్సప్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శర్మన్ శనివారం తెలిపారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజలు తమ ఫిర్యాదు పత్రాన్ని ఫొటో తీసి 91009 04717 నంబర్ కు వాట్సప్ లో పంపాలని సూచించారు. ప్రతీ సోమవారం ఉదయం10.30 నుం చి 12.30 గంటల లోపు వాట్సప్ చేయాలని, పేరు, చిరునా మా తప్పనిసరిగా రాయాలని పేర్కొన్నారు.

Latest Updates