న్యాయాన్ని భూస్థాపితం చేశారు: ప్రకాశ్ రాజ్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ  కోర్టు  ఇవాళ(బుధవారం) సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని, నిందితులను దోషులుగా తేల్చేందుకు ఆధారాలు లేవని తేలుస్తూ.. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ సహా 32 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పుపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు కోర్టు తీర్పును స్వాగతిస్తుండగా… మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లోట్వీట్ చేశారు. ఈ తీర్పుతో న్యాయం భూస్థాపితం అయ్యిందని.. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులయ్యారని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు న్యూ ఇండియా అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Latest Updates