వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం ఇచ్చేశా: ప్రకాశ్ రాజ్

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక ..పూట గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటి వారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి… తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చినట్టు తెలిపారు. తాను ఇంతటితో ఆగిపోనని, సాధ్యమయినంత వరకు సాయం చేస్తానన్నారు.  స్థోమత ఉన్న వారు… అవసరం ఉన్న వారికి సాయం చేయాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్.

Latest Updates