ఎన్నికల సంఘంపై ప్రణబ్ ప్రశంసలు

భారత ఎన్నికల సంఘం(EC)పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ఏళ్ల తర్వాత ఎన్నికల్లో ఓటు వేశానన్నారు. మొదటి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. EC పనితీరు పట్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రణబ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు.

‘‘దేశంలోని సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేయాలంటే అవన్నీ సక్రమంగా పనిచేసే అవకాశం కల్పించాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే.. సుకుమార్‌ సేన్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల కమిషనర్లనంతా బాధ్యతాయుతంగా పనిచేయడం కారణంగాణే అది సాధ్యమయింది. వారి పనితీరును మనం విమర్శించలేం. ఎన్నికలు నిర్వహణ సక్రమంగా జరిగింది’’ అని ప్రణబ్‌ అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు ప్రణబ్‌.

Latest Updates