ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య కేసు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం కలిగించింది. ఆ హత్య కేసు నిందితుడు మారుతీరావు  హైదరాబాద్‌లో విషంతాగి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

కూతురు అమృత వేరే కులం యువకుడైన ప్రణయ్‌ని ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆ  యువకుడిని కొంతమందితో కలిసి చంపించిన మారుతీరావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో నిన్న రాత్రి బసచేశాడు. రాత్రి గది అద్దెకు తీసుకున్న మారుతీరావు అర్థరాత్రి విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు ప్రణయ్ హత్య కేసులో ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయి బయటకొచ్చాడు. ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. పోలీసులు మారుతీరావు చనిపోయిన గదిలో సూసైడ్‌నోటును స్వాధీనం చేసుకున్నారు.

పది రోజుల కిందటే మారుతీరావుకు చెందిన మెకానిక్ షెడ్డులో ఒక మృతదేహం లభించింది. ఆ విషయం కూడా తీవ్ర సంచలనమైంది. ఆ మృతదేహం ఎవరిదనే విషయం ఇంతవరకు బయటపడలేదు.

మారుతీరావు ఆత్మహత్య విషయం గురించి ఆయన కూతురు అమృతను అడిగితే మాత్రం.. తనకు అసలు ఈ విషయం గురించి తెలియదని.. అసలు అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదని ఆమె తెలిపింది.

For More News..

17 నెలల తర్వాత మండలికి వచ్చిన కేసీఆర్

ఇంటర్ ఇంగ్లిష్‌లో 5 తప్పులు.. ఆ తప్పులు ఇవే..

ఇంటికో ఉద్యోగం ఇస్తమని నేను ఎప్పుడూ అనలేదు

Latest Updates