వాషింగ్టన్​ పోస్టులో ప్రణయ్ హత్య ఉదంతం

సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి ప్రణయ్ హత్య ఉదంతం అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాషింగ్టన్ పోస్టులో మంగళవారం ప్రచురితమైంది. మిర్యాలగూడకు చెందిన రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ వ్యాపారి మారుతిరావు కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ 2018 సెప్టెంబర్ 14న హాస్పిటల్‌‌‌‌ నుంచి బయటకు వస్తుండగా దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. అమృత తండ్రి సామాజిక వివక్షతోనే ఈ హత్య చేయించినట్లు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది. ఇండియా చాలా విషయాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నా కులవివక్ష, సామాజిక అంతరాల విషయంలో మాత్రం చెప్పుకోదగ్గ మార్పు రాలేదని విశ్లేషించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య గురించి తెలుసుకునేందుకు అమెరికన్ మహిళా జర్నలిస్ట్ జోనా స్లాటర్ మిర్యాలగూడ వచ్చారు. జులై 7,8వ తేదీల్లో పట్టణంలోనే ఉండి ప్రణయ్‌‌‌‌ తండ్రి, అమృత, వారి ఫ్రెండ్స్‌‌‌‌, పోలీసులు, దళిత సంఘాల నాయకులతో మాట్లాడి వివరాలు సేకరించి ఈ కథనం రాశారు. దాంట్లో గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనలు కొన్నింటిని ప్రస్తావించారు.

Latest Updates